టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్
దిశ, వెబ్‌డెస్క్: చైన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ప్రదర్శన కనభర్చింది. భారత బౌలర్లకు కఠిన పరీక్ష పెడుతూ.. టీమిండియాపై ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్(33) పరుగులకు పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ సిబ్లి(87)తో కలిసి కెప్టెన్ జో రూట్ (128) రెండు వందల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొదటి రోజు ఆట […]
దిశ, వెబ్‌డెస్క్: చైన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ప్రదర్శన కనభర్చింది. భారత బౌలర్లకు కఠిన పరీక్ష పెడుతూ.. టీమిండియాపై ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్(33) పరుగులకు పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ సిబ్లి(87)తో కలిసి కెప్టెన్ జో రూట్ (128) రెండు వందల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొదటి రోజు ఆట ముగిసే చివరి సమయంలో ఓవర్ బుమ్రా బౌలింగ్‌లో సిబ్లి ఎల్బీడబ్యూ అయి సెంచరీని చేజార్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇవాళ ఇండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో రూట్ రూట్ సెంచరీ బాదాడు. కేవలం 164 బాల్స్ లోనే 12 ఫోర్లతో రూట్ 128 వ్యక్తిగత స్కోరును అందుకున్నాడు. అయితే రూట్ ఇప్పటివరకూ ఆడిన టెస్టుల్లో అతనికి ఇది వందో టెస్ట్ కావడం విశేషం. అంతేగాకుండా అతనికిది 20వ సెంచరీ. టెస్టు క్రికెట్ చరిత్రలో 98,99,100వ మ్యాచుల్లో వరుసగా సెంచరీలు చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర రూట్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 9 మంది ప్లేయర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించారు. కోలిన్ చౌదరీ, జావెద్ మియాందాద్, గార్డెన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టివార్ట్, ఇంజిమాముల్ హాక్, రికీ పాంటింగ్(రెండు సెంచరీలు), గ్రేమ్ స్మిత్, హషీం ఆమ్లా తమ వందో టెస్టులో సెంచరీలు నమోదు చేయగా, ఇప్పుడు వారి సరసన రూట్ చేరాడు. ఈ మ్యాచ్‌లో 63రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను సిబ్లీతో కలిసి రూట్ ఆదుకున్నాడు.