అటవీ భూముల కేటాయింపునకు తక్షణమే చర్యలు తీసుకోండి
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

దిశ, మల్హర్( భూపాలపల్లి) : చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కాటారం, మహాదేవపూర్ మండలాల్లో ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు, అదే విధంగా ఘన్పూర్ మండలంలోని బుద్దారం నుండి రేగొండ మండలం రామన్నగూడెం తండా వరకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపు విషయమై అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ సమక్షించి అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఈఈ యాదగిరి, తహసీల్దార్లు, మెగా ప్రాజెక్టు అధికారులతో పాటు వివిధ శాఖల అధికారు పాల్గొన్నారు.