పోసాని విడుదల.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

24 రోజుల పాటు నిర్బంధం తర్వాత జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు....

Update: 2025-03-22 12:07 GMT
పోసాని విడుదల.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: 24 రోజుల పాటు నిర్బంధం తర్వాత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కోర్టు నుంచి పోసాని విడుదల అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోసాని ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు. న్యాయస్థానం పెట్టిన షరతుల వల్ల మీడియాతో పోసాని మాట్లాడలేకపోయారు. గౌరవమైన కోర్టుల ఆదేశాలతో ఆయన వెళ్లిపోయారు. మేము ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడదామని మీ ముందుకు వచ్చాం. 24 రోజుల పాటు పోసాని నిర్బంధంలో ఉన్నారు. పోసాని హత్యలు, దొంగతనం, దోపిడీ చేయలేదు. మీడియా ముందు మాట్లాడారు. అది అసభ్యంగా మాట్లాడారని కేసు పెట్టారు. ముందేమో నంది అవార్డ్స్ మీద కేసు పెట్టారు. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారని, తనకు వద్దని చెప్పినందుకు ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత మరోచోట మరో కేసు పెట్టారు. మొత్తం 18 కేసులు పెట్టారు. రెండు ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 రోజుల పాటు నిర్బంధం చేశారు.’’ అని వ్యాఖ్యానించారు. 

**26వ తారీకున హైదరాబాద్‌లో అరెస్ట్ చేస్తారు. రైల్వే కోడూరుకు తీసుకొస్తారు. అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ నుంచి నర్సరావుపేట తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టారు. అక్కడి నుంచి గుంటూరు జైలులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ గుంటూరు తీసుకొచ్చారు. అంతకన్నా శిక్షేంకావాలి. పోసాని చేసిన నేరం ఏంటి.?. మీడియాలో దూషించాడట. అది తప్పా, రైటా అనేది విచారణ అనంతరం న్యాయ స్థానాలు తేలుస్తాయి. తెలుగదేశం నాయకులు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. అయితే వాళ్ల మీద కేసులు ఉండవు. పాపం పోసాని హాస్యం పడించేలా రెండు మాటలు మాట్లాడి ఉండొచ్చేమో. ప్రెస్ మీట్‌లో అసభ్యంగా మాట్లాడితే పోలీస్ కస్టడీ అడుగుతారు. మనిషిని ఏ విధంగా భయపెట్టాలో అన్ని విధాలుగా పోసానిని భయపెట్టారు.’’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 

Tags:    

Similar News