అమెరికాలో ఆంధ్రా యువకుడు మృతి.. డెడ్‌బాడీ కోసం రోదిస్తున్న తల్లిదండ్రులు
అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న కుమారుడి మృతదేహం కోసం తల్లిదండ్రులు రోదిస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)లో ఆంధ్ర(Andhra Pradesh) యువకుడు మృతి చెందారు. ఏపీ రాష్ట్రం గుడివాడ(Gudivada)కు చెందిన కొల్లి అభిషేక్(Kolli Abhishek) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఏడాది క్రితం పెళ్లి చేసుకుని తన భార్యను కూడా అక్కడికి తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని పీనెక్స్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే ఆర్నేళ్లుగా ఉద్యోగం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. రెండు రోజుల క్రితం అభిషేక్ కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో అభిషేక్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుడివాడలో రోదిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని త్వరగా పంపించాలని కోరుతున్నారు.
అయితే అభిషేక్ ఆత్మహత్య చేసుకోవడంలో అమెరికాలో కేసు నమోదు అయింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఐడీ కార్డు ఆధారంగా అభిషేక్ తమ్ముడి అరవింద్‌కి సమాచారం అందించారు. ఇప్పటికే అభిషేక్ భార్యను ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మృతి చెందినట్లు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం అభిషేక్ మృతదేహాన్ని గుడివాడకు పంపిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. అభిషేక్ మృతదేహం గుడివాడకు శుక్రవారానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్నారు. తన కొడుకు మృతదేహాన్ని చూడాలని, త్వరగా పంపాలని విలపిస్తున్నారు.