భార్యా,భర్తల మధ్య గొడవ.. భర్తతో పాటు పోలీసులకూ చుక్కలు చూపించిన మహిళ
భార్యా, భర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. మళ్లీ కాసేపటికే కలిసిపోతారు. కానీ ఇలా అన్ని కుటుంబాల్లో జరుగదు.

దిశ, వెబ్‌డెస్క్: భార్యా, భర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. మళ్లీ కాసేపటికే కలిసిపోతారు. కానీ ఇలా అన్ని కుటుంబాల్లో జరుగదు. కొన్ని కుటుంబాలు చిన్న చిన్న గొడవలకే ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. క్షణికావేశంలో కుటుంబాలను రోడ్డున పడేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీ(AP)లో చోటుచేసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సరైన సమయానికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో పెను ముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే..
పీఎం పాలెం పోలీస్ స్టేషన్(PM Palem Police Station) పరిధి మధురవాడ వైఎస్సార్ కాలనీ(YSR Colony)లో నివాసముండే ఇద్దరు భార్యా, భర్తల మధ్యల గొడవలు జరుగుతున్నాయి. భర్త తనను సరిగా చూసుకోవడం లేదని భార్య ఆవేదన చెందుతోంది. గురువారం మరింత భావోద్వేగానికి గురైన సదరు మహిళ ఇంటి మేడ మీదకు ఎక్కి దూకేస్తానని హల్‌చల్ చేసింది. దీనిపై స్థానికుల సమాచారంతో పీఎంపాలెం ఎస్ఐ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కిందకు దింపారు. ఆ మహిళను రక్షించేందుకు పోలీసులు చేసిన సాహసంపై స్థానికులు హర్షం వ్యక్తం చేసి.. అభినందించారు..
వైజాగ్ - పీఎం పాలెంలో భర్త సరిగా చూసుకోవడం లేదని మనస్తాపంతో దూకేస్తానంటూ మేడెక్కి కూర్చున్న మహిళచాకచక్యంగా మహిళను కాపాడిన పోలీసులు. pic.twitter.com/z5z201BZPW— Telugu Scribe (@TeluguScribe) March 27, 2025