Optional Holiday: రేపు టెన్త్ ఎగ్జామ్ ఉందా.. లేదా?.. క్లారిటీ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి(10th Class) పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-31 07:41 GMT
Optional Holiday: రేపు టెన్త్ ఎగ్జామ్ ఉందా.. లేదా?.. క్లారిటీ ఇదే!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి(10th Class) పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్ ఈ నెల(మార్చి) 17న ప్రారంభమయ్యాయి. అయితే మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు(సోమవారం) జరగాల్సిన పదో తరగతి పరీక్షను ఒకరోజు వాయిదా వేసిన సంగతి విదితమే. సోమవారం(మార్చి 31) రంజాన్ సందర్భంగా సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం(AP Government) రేపు(మంగళవారం) ఆప్షనల్ హాలిడే(Optional Holiday) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు జరగాల్సిన పదో తరగతి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనే గందరగోళం విద్యార్థుల్లో నెలకొంది. ఈ విషయం పై విద్యాశాఖ అధికారులు తాజాగా స్పందించారు. ‘ఆప్షనల్ హాలిడే’ ఇచ్చినంత మాత్రాన పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని రేపు(ఏప్రిల్ 1న) యథావిధిగా ఎగ్జామ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు(Students) ఈ విషయాన్ని గమనించి చివరి పరీక్ష సోషల్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవ్వాలని సూచించారు.

Tags:    

Similar News