‘ఇలాంటి సినిమాలు ఏ జనరేషన్‌కు అయిన నచ్చుతాయ్’.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2025-03-31 08:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పద్మభూషణ్ పై బాలకృష్ణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య-369 చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీన 4K వెర్షన్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం నిన్న(ఆదివారం) హైదరాబాద్‌(Hyderabad)లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పద్మభూషణ్ పురస్కారం ఆలస్యంగా వచ్చిందని చాలామంది అంటున్నారని గుర్తు చేశారు. కానీ సరైన సమయానికే నాకు ఈ పురస్కారం వచ్చిందని చెబుతుంటాను అన్నారు. ఇక ఆదిత్య 369(Aditya 369) వంటి సినిమాలు ఏ జనరేషన్‌కి అయిన నచ్చుతాయని అన్నారు. ఇలాంటి చిత్రాలు రూపొందించాలని చాలామంది ప్రయత్నించారని పేర్కొన్నారు. కానీ కొన్ని ప్రారంభించకుండానే ఆగిపోయాయని తెలిపారు. మరిన్ని సినిమాలు ఈ స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Read More..

‘ఇదేనా పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News

Sahar krishnan