Rain Alert:రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎప్పటి నుంచంటే?
రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు తీవ్ర వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వేసవి తాపంతో అల్లాడి పోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) చల్లటి కబురు చెప్పింది.
నేటి(సోమవారం) నుంచి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో వర్షాలు(Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఈరోజు మోస్తరు వర్షాలు, రేపు(మంగళవారం) ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ(Telangana)లో కూడా ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబబ్‌నగర్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకువాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.