సర్వ మానవాళికి అంతిమ దైవ గ్రంథం సందేశం ధార్మిక సభ

డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ముస్లిం సోదరులు, జమియత్ అహ్లే హదీస్ ఆధ్వర్యంలో జిల్లా జమియత్ అహ్లే హదీస్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఖాన్ అధ్యక్షతన ముమ్మిడివరం టీడీపీ కార్యాలయ ఆవరణలో.. ఆదివారం సాయంత్రం సర్వ మానవాళికి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సందేశం అనే ధార్మిక సభ నిర్వహించబడింది.

Update: 2025-03-24 13:30 GMT
సర్వ మానవాళికి అంతిమ దైవ గ్రంథం సందేశం ధార్మిక సభ
  • whatsapp icon

దిశ, కోనసీమ ప్రతినిధి: డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ముస్లిం సోదరులు, జమియత్ అహ్లే హదీస్ ఆధ్వర్యంలో జిల్లా జమియత్ అహ్లే హదీస్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఖాన్ అధ్యక్షతన ముమ్మిడివరం టీడీపీ కార్యాలయ ఆవరణలో.. ఆదివారం సాయంత్రం సర్వ మానవాళికి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సందేశం అనే ధార్మిక సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త షేక్ షరీఫ్ ప్రసంగిస్తూ.. సర్వ మానవాళి ఒకే జంట సంతానమని, మనందరి సృష్టి కర్త ఒక్కరే అని, ఆయన్ని గుర్తించాలని, తద్వారా సామాజిక రుగ్మతలను అరికట్టగలము అని వివరించారు. ఈ సభలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనమంతా కలిసి ఉండాలని మరియు ముస్లింలకు ఏ సమస్య వచ్చినా తాను వెంటనే స్పందిస్తానని, అసెంబ్లీలో కూడా నియోజకవర్గ ముస్లిం సమస్యలపై మైనారిటీస్ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూఖ్ తో చర్చించారని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పి రాజశేఖర్ హాజరై తన విలువైన సందేశాన్ని అందజేశారు. ఈ సభకు కన్వీనర్ గా షేక్ అబ్దుల్లా,షేక్ ఇక్తార్ అహ్మద్ వ్యవహరించారు. ఈ సభలో టీడీపీ నాయకులు తాడి నరసింహ రావు, గుత్తుల సాయి, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్, బాలు తదితరులు పాల్గొన్నారు


Similar News