ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

Update: 2025-03-27 08:03 GMT
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ ​బ్యూరో : ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. జగ్గయ్యపేటలో సీసీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. తాము అధికారంలో కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల కిందటే 1000 సీసీ కెమెరాలు, 28 డ్రోన్ ల ఏర్పాటు చేశామన్నారు. టీవీ, ఫ్రిడ్జి, ఏసీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరా కూడా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ లతో నేరస్థులు చెల్లాచెదురవుతున్నారని తెలిపారు. విజయనగరంలో లారీలో కూర్చుని పేకాటడుతున్న వారిని డ్రోన్ తో పట్టుకోవడం జరిగిందన్నారు. హెల్మెట్ లేదని పట్టుకుంటే నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసే పరిస్థితి మంచిది కాదన్నారు. ఫోన్ కి స్క్రీన్ గార్డు వేయిస్తారు.. విలువైన ప్రాణాన్ని రక్షించే హెల్మెట్ పెట్టుకోరా? అని ప్రశ్నించారు. శక్తి యాప్ , శక్తి టీంలు మహిళలను రక్షిస్తాయని తెలిపారు.

Tags:    

Similar News