మహిళా మృతదేహం కలకలం.. ఇంతకీ ఆమె ఎవరు? ఇదిగో ఆనవాళ్లు
మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామ శివారు నుంచి కేతిరెడ్డి కాలనీ వెళ్లే దారిలో రేగాటిపల్లి గ్రామానికి చెందిన తిమ్మన్న గారి నాగిరెడ్డి బీడు పొలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం పోలీసులు గుర్తించారు.

దిశ, ధర్మవరం రూరల్: మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామ శివారు నుంచి కేతిరెడ్డి కాలనీ వెళ్లే దారిలో రేగాటిపల్లి గ్రామానికి చెందిన తిమ్మన్న గారి నాగిరెడ్డి బీడు పొలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం పోలీసులు గుర్తించారు. డీఎస్పీ హేమంత్ కుమార్, రూరల్ సీఐ ప్రభాకర్, పట్టణ టూ టౌన్ సీఐ రెడ్డప్ప, శ్రీనివాసులు సంఘటనా స్థలానికి డాగ్ డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు గుర్తులను తెలిపారు.
మృతురాలు తల గుండు చేయించుకొని, 35-40 సంవత్సరాలలోపు ఉన్నట్లు తెలిపారు. చిలక పచ్చ రంగులో లవ్ సింబల్ డిజైన్లు కలిగిన పాచి రంగు చీర, పాచి కలర్ జాకెట్, లైట్ పింక్ కలర్, నల్లపూసల దండ, ఒక జత పింక్ రంగు చెప్పులు ధరించి, చీర కొంగుకు తాళం చెవులు ముడి వేసినట్లు తెలిపారు. మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే ధర్మవరం రూరల్ సీఐ నెంబర్ 94407 96832, రూరల్ ఎస్సై నంబర్ 94407 96834 లకు సమాచారం అందించాలన్నారు.