తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తం.. భారీగా పోలీసుల మోహరింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram District) తాడిపత్రి(Thadipatri)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కౌన్సిలర్ భాషా(YCP Councilor Bhasha) ఇంటి వద్ద అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు యత్నించారు. అయితే టీడీపీ(Tdp) కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Municipal Chairman JC Prabhakar Reddy) అక్కడ కు వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేశారు.