సైబర్ నేరగాళ్ల వలలో సీనియర్ ఉద్యోగి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజలు మోసపోతూనే ఉన్నారు.
దిశ, ధర్మవరం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ధర్మవరం పట్టణంలోని డిటి సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ లైన్ మాన్ నాగరాజు రూ.50వేలు మోసపోయాడు. శనివారం ఏఈ నాగభూషణంకు క్రైమ్ నేరగాళ్లు ఎసిపి డీఎస్పీ ఫోన్ చేస్తున్నామని, మీ కార్యాలయంలో సీనియర్ ఉద్యోగి పేరు చెప్పాలని చెప్పారు. దీంతో ఏఈ నాగభూషణం లైన్మెన్ నాగరాజు సీనియర్ ఉద్యోగిగా చెప్పడంతో వెంటనే ఆయన్ని లైన్ కలపాలని క్రైమ్ నేరగాళ్లు ఆదేశించారు.
అతను వెంటనే లైన్ కలపడంతో లైన్ మెన్‌ను మీరు చాలా అక్రమాలకు పాల్పడ్డారని, మీపై తగు చర్యలు తీసుకుంటామని బెదిరించారు. లేదంటే రూ.4లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ లైన్‌మెన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మళ్లీ సైబర్ నేరగాళ్లు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఎవరికీ చెప్పకుండా వెంటనే ఫోన్ పే రూ.50,000 వేయాలని చెప్పడంతో లైన్మెన్ నాగరాజు రూ.50,000 ఫోన్ పే ద్వారా క్రైమ్ నేరగాళ్లకు చెల్లింపు చేశారు. చివరికి విషయం తెలుసుకున్న లైన్మెన్, ఏఈలు లబోదిబోమన్నారు. అనంతరం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also..