విషాదం.. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

అనంతపురం జిల్లా హిందూపురంలో విషాదం చోటు చేసుకుంది...

Update: 2025-03-09 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) హిందూపురం(Hindupur)లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువు(Pond)లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం కావడంతో చిన్నారులు అయాన్ (12), రిహాన్(14) చెరువు వద్దకు వెళ్లారు. స్నానం(Bath) చేసేందుకు చెరువులో దిగారు. కొద్దిసేపటికే నీటి(Water)లో మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసేలోపే చిన్నారులు ఇద్దరు నీటిలో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో చిన్నారుల ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఉన్నాహంగా కనిపించే అయాన్, రిహాన్ ఇక లేరని తెలిసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. 

Tags:    

Similar News