అబ‌ద్ధాల‌కు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. టీడీపీ ట్వీట్ కు వైఎస్ఆర్సీపీ కౌంటర్

రాష్ట్రంలో అబ‌ద్ధాల‌కు కేరాఫ్ అడ్రస్ ఎవ‌రైనా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు మాత్రమేనని వైఎస్ఆర్సీపీ పార్టీ ట్వీట్ చేసింది.

Update: 2025-03-16 15:54 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అబ‌ద్ధాల‌కు కేరాఫ్ అడ్రస్ (Care Of Address) ఎవ‌రైనా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మాత్రమేనని వైఎస్ఆర్సీపీ పార్టీ (YSRCP Party) ట్వీట్ చేసింది. టీడీపీ పార్టీ (TDP Party) చేసిన ట్వీట్ పై కౌంటర్ (Counter) ఇస్తూ.. పలు విమర్శలు చేసింది. ఈ సందర్భంగా.. చంద్రబాబు అబ‌ద్ధాలు చెప్పడం.. దాన్ని ఎల్లో మీడియా (Yellow Media) ప్రచారం చేయ‌డం ద‌శాబ్దాలుగా జ‌రుగుతూనే వ‌స్తోందని చెప్పింది. అబ‌ద్ధాల‌ను నిజం చేయాల‌నే వాళ్ల తాప‌త్రయం అంతా ఇంతా కాదని ఎద్దేవా చేసింది.

అలాగే తాజాగా పొట్టి శ్రీరాములు జ‌యంతి కార్యక్రమంలో (Potti Sriramulu Birth Anniversary Programme) పాల్గొన్న చంద్రబాబు.. నెల్లూరు జిల్లాకు (Nellore District) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా తానే పేరు పెట్టాన‌ని ప‌చ్చి అబ‌ద్ధం చెప్పారని వ్యాఖ్యానించింది. వాస్తవంగా నెల్లూరు జిల్లాను 2008 జూన్ 4న‌ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారని, దివంగ‌త మ‌హా నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (YS Rajashekar Reddy) హ‌యాంలోనే నెల్లూరు జిల్లా పేరు మార్పు జ‌రిగిందని తెలిపింది. అంతేగాక అది కూడా చంద్రబాబు త‌న ఖాతాలోనే వేసుకునే ప్రయ‌త్నం చేయ‌డం సిగ్గుచేటు అని దుయ్యబట్టింది. కాగా పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్పూర్తి గుర్తుండి పోవటానికి, ఆయన పేరుతో జిల్లాని పెట్టింది తానేనని చెప్పారు. అంతేగాక ఇప్పుడు కూడా ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా, రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టీడీపీ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.


Similar News