Fire: చూస్తుండగానే కాలిపోయిన లారీ

అందరూ చూస్తుండగానే క్షణాల్లో లారీ అగ్నికి ఆహుతైంది..

Update: 2025-03-23 12:03 GMT
Fire: చూస్తుండగానే కాలిపోయిన లారీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అందరూ చూస్తుండగానే క్షణాల్లో లారీ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా(Anantapur District) గార్లదిన్నె మండలం తిమ్మంపల్లి(Thimmampally)లో జరిగింది. గన్నీ సంచుల లోడ్‌తో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. అయితే తిమ్మంపల్లి సమీపంలో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ లారీలో నుంచి బయటకు దూకేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే లారీతో పాటు గన్నీ సంచులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎండల తీవ్రతల వల్ల ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Tags:    

Similar News