మధుయాష్కిని ఉరికించి కొడతారు : జీవన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : ఫాదర్ ఆఫ్ ది కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటే అవినీతి.. అవినీతి అంటేనే కాంగ్రెస్ అని విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుయాష్కి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మధుయాష్కి నేరచరిత్ర అందరికీ తెలుసునని.. ఆరోపణలు మానుకుంటే మంచిదని సూచించారు. […]

Update: 2021-07-29 04:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఫాదర్ ఆఫ్ ది కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటే అవినీతి.. అవినీతి అంటేనే కాంగ్రెస్ అని విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుయాష్కి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మధుయాష్కి నేరచరిత్ర అందరికీ తెలుసునని.. ఆరోపణలు మానుకుంటే మంచిదని సూచించారు. పిచ్చిగా మాట్లాడితే జన ఉరికించి కొడతారని హెచ్చరించారు. సీఎం కేసీఆ‌ర్‌ను కచరా అని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎక్కడ తిరిగితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

నిజామాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్సీ కవిత పాటుపడుతున్నారని ఆమెను ఒక మహిళ అని చూడకుండా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తిట్టడం స్టార్ట్ చేస్తే ఆ గాలికే కొట్టుకుపోతావ్ అన్నారు. మధుయాష్కి ఏ గ్రామానికి వెళ్లినా అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, పురాణం సతీష్, వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News