గిట్టుబాటు కాదు.. లాభసాటి ధర కావాలి : పవన్

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు అండగా ఉండేందుకు కొత్త కార్యాక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గురువారం తిరుపతిలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జై కిసాన్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు అండగా నిలుస్తామన్నారు. రైతులను దళారీ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించాలన్నారు. జనసేన పార్టీ రైతులకు అండగా ఉండేందుకు ఇకపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. వారికి కావాల్సింది గిట్టుబాటు ధర కాదని.. లాభసాటి ధరని చెప్పుకొచ్చారు. ఏపీలో నివర్ […]

Update: 2020-12-03 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు అండగా ఉండేందుకు కొత్త కార్యాక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గురువారం తిరుపతిలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జై కిసాన్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు అండగా నిలుస్తామన్నారు. రైతులను దళారీ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించాలన్నారు. జనసేన పార్టీ రైతులకు అండగా ఉండేందుకు ఇకపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. వారికి కావాల్సింది గిట్టుబాటు ధర కాదని.. లాభసాటి ధరని చెప్పుకొచ్చారు. ఏపీలో నివర్ తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 35వేల నష్టపరిహారం చెల్లించాలని’ డిమాండ్ చేశారు.

రైతుల మేలు కోసం బీజేపీ సర్కార్ కొత్త చట్టాలు తెచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, గత కొద్దిరోజులుగా ఆందోళన చేపడుతున్న పంజాబ్, హర్యానా రైతులతో కేంద్రం చర్చలు జరుపుతోందన్నారు. చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News