టెస్టులు చేస్తరా చేయరా.. మీ వల్లే కేసులు పెరుగుతున్నాయ్
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ టెస్టులు నిర్వహించడం లేదంటూ ప్రజలు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు రోజులుగా ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వచ్చినప్పటికీ టెస్టులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టులు చేసేసరికి రోగాలు ముదిరి ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి నెలకొందని వాపోయారు. కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులు టెస్టుల […]
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ టెస్టులు నిర్వహించడం లేదంటూ ప్రజలు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు రోజులుగా ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వచ్చినప్పటికీ టెస్టులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టెస్టులు చేసేసరికి రోగాలు ముదిరి ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి నెలకొందని వాపోయారు. కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులు టెస్టుల కోసం ఆస్పత్రికి వస్తే కిట్లు లేకపోవడంతో టెస్టులు నిర్వహించడం లేదని, దీంతో లక్షణాలు ఉన్నవారు బయట తిరుగడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొవిడ్ టెస్టులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.