లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ‘జగిత్యాల టు సికింద్రాబాద్’ స్పెషల్ బస్..

దిశ, జగిత్యాల; పట్టణ ప్రయాణికుల నుంచి వస్తున్న అసంఖ్యాక విజ్ఞప్తుల మేరకు జగిత్యాల కొత్త బస్‌స్టేషన్ నుండి సికింద్రాబాద్ వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఒక సూపర్ లగ్జరీ సర్వీస్ నడప బడుతుందని జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. శనివారం నుంచి ప్రారంభమవుతున్న ఈ బస్‌తో పాటు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి కూడా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు.. జగిత్యాల […]

Update: 2021-05-14 09:06 GMT

దిశ, జగిత్యాల; పట్టణ ప్రయాణికుల నుంచి వస్తున్న అసంఖ్యాక విజ్ఞప్తుల మేరకు జగిత్యాల కొత్త బస్‌స్టేషన్ నుండి సికింద్రాబాద్ వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఒక సూపర్ లగ్జరీ సర్వీస్ నడప బడుతుందని జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. శనివారం నుంచి ప్రారంభమవుతున్న ఈ బస్‌తో పాటు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి కూడా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు.. జగిత్యాల వరకు సూపర్ లగ్జరీ బస్సులు నడిపబడుతుందన్నారు.

ప్రయాణికులు నిర్ణీత సమయం కంటే పదిహేను నిమిషాలు ముందుగానే బస్ స్టేషన్ చేరుకొని రాకపోకలు సాగించుకోవాలని ఆయన తెలిపారు. ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ప్రయాణికుల కోసం లాక్‌డౌన్, కర్ఫ్యూ సమయంలో ఏర్పాటు చేసిన ఈ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని డిఎం తెలిపారు.

Tags:    

Similar News