హిట్లర్‌కు పట్టిన గతే జగన్‌కు పడుతుంది :యనమల
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని ఆరోపించారు. గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన జగన్‌కు నిరుద్యోగ యువత, విద్యార్థులు గుణపాఠం చెప్పాలని సూచించారు. జగన్ అసత్యాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల భవిష్యత్తు తరాలు ఉద్యోగాలు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని ఆరోపించారు. గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన జగన్‌కు నిరుద్యోగ యువత, విద్యార్థులు గుణపాఠం చెప్పాలని సూచించారు.
జగన్ అసత్యాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల భవిష్యత్తు తరాలు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గోబెల్స్ ప్రచారం తరహాలోనే జగన్ విధానాలున్నట్లు ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌కు పట్టిన గతే సీఎం జగన్‌కు పట్టనుందని హెచ్చరించారు. బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ లేకుంటేనే ప్రత్యేక హోదా గురించి గట్టిగా డిమాండ్ చేయగలం అన్న జగన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగన్ స్వలాభం కోసమే ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం పోరాడితే వచ్చే ప్రత్యేక హోదా అంశాన్ని కేసుల మాఫీ కోసం తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. శాసనసభలో జగన్ చేసిన మండలి రద్దు తీర్మానం టీడీపీపై కక్షతో తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసింది కాదని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.