‘ఆ జట్టు బలమైనదే.. కానీ, ఓడించే ప్రణాళిక మా వద్ద ఉంది’
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను కోల్పోయి.. రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు గత సీజన్‌లో అద్భుతంగా రాణించింది. కానీ, ఈసారి సీజన్‌కు అయ్యర్ దూరం కాగా.. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు.. అయినప్పటికీ, అయ్యర్ లోటును భర్తీ చేస్తూ.. ఏ మాత్రం తీసుపోకుండా జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్స్, […]
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను కోల్పోయి.. రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు గత సీజన్‌లో అద్భుతంగా రాణించింది. కానీ, ఈసారి సీజన్‌కు అయ్యర్ దూరం కాగా.. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు.. అయినప్పటికీ, అయ్యర్ లోటును భర్తీ చేస్తూ.. ఏ మాత్రం తీసుపోకుండా జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్స్, +0.453 నెట్‌రన్‌రేట్‌తో మూడో స్థానంలో కొనసాగుతుంది.
ఇక ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించారు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ట్యాలెంట్ ఉన్న జట్టు.. కానీ, ముంబై ఇండియన్స్ వద్ద ప్రణాళిక ఎల్లప్పుడూ ఉంటుంది’ అందుకే గతేడాది ముంబై డీసీతో ఆడిన 4 మ్యాచుల్లో నెగ్గింది అని షేన్ బాండ్ గుర్తు చేశారు. ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే షేన్ బాండ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి.. ఢిల్లీ జట్టు సత్తా చాటాలని చూస్తుంటే.. మరోసారి గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని రోహిత్ సేన సమాయత్తం అవుతోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మ్యాచ్ ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.