ఆదిలాబాద్‌లో ఆసక్తికర రాజకీయం.. కారు‌కు క్రాస్‌ ఓటింగ్ బెంగ

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజాగా ఆసక్తికర రాజకీయం నెలకొంది. అసలు ఎన్నికలే ఉండవని.. ఏకగ్రీవం అవుతుందనుకున్న స్థానంలో ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి.. రెండు డజన్ల మంది బరిలో ఉండగా.. 22మంది అభ్యర్థులను పోటీ నుంచి తప్పించినా.. చివరికి ఇద్దరి మధ్య పోటీ నెలకొనడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.. పోటీ తప్పనిసరి కావటంతో.. నేడు పోలింగ్ జరుగుతోంది.. మెజారిటీ ఉన్నా.. క్రాస్ ఓటింగ్ బెంగ పట్టుకుంది.. సర్కారు, […]

Update: 2021-12-09 11:51 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజాగా ఆసక్తికర రాజకీయం నెలకొంది. అసలు ఎన్నికలే ఉండవని.. ఏకగ్రీవం అవుతుందనుకున్న స్థానంలో ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి.. రెండు డజన్ల మంది బరిలో ఉండగా.. 22మంది అభ్యర్థులను పోటీ నుంచి తప్పించినా.. చివరికి ఇద్దరి మధ్య పోటీ నెలకొనడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.. పోటీ తప్పనిసరి కావటంతో.. నేడు పోలింగ్ జరుగుతోంది.. మెజారిటీ ఉన్నా.. క్రాస్ ఓటింగ్ బెంగ పట్టుకుంది.. సర్కారు, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అసంతృప్తి ఒకవైపు.. ఏకమవుతున్న ఆదివాసీ ఓటర్లకు విపక్ష, స్వతంత్ర ఓటర్లకు తోడవుతుండటంతో అధికార పార్టీకి పోలింగ్ టెన్షన్ మొదలైంది..!

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. రేపు పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి దండె విఠ్ఠల్ బరిలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పారాణి పోటీలో ఉన్నారు. అధికార పార్టీ అంచనాలు మొదటి నుంచి తలక్రిందులవుతూనే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన సీనియర్లు, కొందరు ఎమ్మెల్యేలే సొంత పార్టీ నుంచి అభ్యర్థులను బరిలో దింపటంలో కీలక పాత్ర పోషించారు. వీరందరిని తప్పించేందుకు నానా తంటాలు పడిన అధికార పార్టీ.. ఏకగ్రీవం కావాల్సిన స్థానంలో పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ.. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలుండటంతో.. అధికార పార్టీలో ఆందోళన మొదలైంది.

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు 937మంది ఉండగా.. ఇందులో 554మంది అధికార టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మరికొందరు స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు తర్వాత గులాబీ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం బాగా పెరిగింది. తాజాగా మూడింటా రెండొంతుల మెజారిటీ ఓటర్లు ఉండటంతో.. ఆ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసమని చెప్పవచ్చు. అలాంటిది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి అభ్యర్థులు లేకపోయినా.. స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పారాణి బరిలో ఉండటంతో చివరి వరకు టెన్షన్ తప్పటం లేదు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ బరిలో ఉండగా.. ఆ సామాజిక ఓట్లు గంపగుత్తగా ఆమె పడతాయనే చర్చ సాగుతోంది.

మరోవైపు విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు కూడా స్వతంత్ర అభ్యర్థికే పడతాయనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నుంచి 180 మంది, బీజేపీ నుంచి 73మంది, స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి 100మంది వరకు గెలిచారు. ఈ లెక్కన 350మంది వరకు అవుతున్నారు. వీరిలో కొందరు అధికార పార్టీలో చేరారు. మరోవైపు 180కిపైగా ఆదివాసీ ఓటర్లు ఉండగా.. అధికార పార్టీలో ఉన్న వారు స్వతంత్ర అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయనే చర్చ ఉంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు కూడా తమ ఓటర్లకు ఫోన్లు చేసి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయాలని చెబుతున్నారు. ఇదే జరిగితే అధికార పార్టీకి చిక్కులు తప్పేలా లేవు.

ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, నిధులు, విధులు, ప్రాధాన్యత లేకపోవటంతో కొందరు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ పోలింగ్ కేంద్రాల వారీగా క్యాంపులు పెట్టింది. ఓటర్లు చేజారకుండా.. క్రాస్ ఓటింగ్ చేయకుండా పక్కగా ఏర్పాట్లు చేస్తోంది. గురువారం క్యాంపులకు రప్పించగా.. శుక్రవారం ఉదయం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. ఇక ఒక్కో ఓటరకు రూ.లక్ష ఇస్తున్నట్లు సమాచారం. ఓటింగ్ ఏ విధంగా వేయాలో గురువారం రాత్రికే అవగాహన కల్పిస్తున్నారు. ఇక విపక్ష ఓటర్లకు కూడా రూ.50వేలు ఇవ్వాలని భావించగా.. తాజాగా రూ.లక్షకు రేటు పెంచినట్లు తెలిసింది. తమ ఓటర్లు క్రాస్ చేసినా.. విపక్ష ఓటర్లు కొందరు వేస్తే కలిసి వస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News