దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది
దిశ, వెబ్డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా కోలుకోంటోందని కేంద్ర ఆర్థి మంత్రి నిర్మలా సీతారామాన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్దీపన ప్యాకేజీలకు సంబంధించి గురువారం నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయని తెలిపారు. గత అక్టోబర్ తో పోలిస్తే 10 శాతం జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉన్నాయన్నారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి బలంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా […]
దిశ, వెబ్డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా కోలుకోంటోందని కేంద్ర ఆర్థి మంత్రి నిర్మలా సీతారామాన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్దీపన ప్యాకేజీలకు సంబంధించి గురువారం నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయని తెలిపారు. గత అక్టోబర్ తో పోలిస్తే 10 శాతం జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉన్నాయన్నారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి బలంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని .. అలాగే పలు రంగాలు ఆర్థికంగా పుంజుకొన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బ్యాంకు రుణాలు 5.1శాతం పెరిగాయన్నారు. ఏప్రిల్-ఆగస్టు మధ్య 35.37 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయన్నారు. గతేడాదితో పోలిస్తే వీదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ అభియాన్ మంచి ఫలితాన్నిచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం ఒకే రేషన్’ పథకంతో 68.6 కోట్ల మంది లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోగలుగుతున్నారని చెప్పారు.