ఇంగ్లాండ్ చేరిన టీమ్ ఇండియా క్రికెటర్లు
దిశ, స్పోర్ట్స్: సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ ఇండియా క్రికెటర్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో బయలుదేరారు. పురుషులు, మహిళ క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులు, సహాయక, వ్యక్తిగత సిబ్బంది అందరి కోసం ఒకటే విమానం బీసీసీఐ కేటాయించింది. వీరందరూ ముంబైలో ఫ్లైట్ ఎక్కి గురువారం ఉదయం హీత్రో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇంగ్లాండ్ చేరుకున్న విషయాన్ని టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. హీత్రో విమానాశ్రయం నుంచి […]
దిశ, స్పోర్ట్స్: సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ ఇండియా క్రికెటర్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో బయలుదేరారు. పురుషులు, మహిళ క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులు, సహాయక, వ్యక్తిగత సిబ్బంది అందరి కోసం ఒకటే విమానం బీసీసీఐ కేటాయించింది. వీరందరూ ముంబైలో ఫ్లైట్ ఎక్కి గురువారం ఉదయం హీత్రో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇంగ్లాండ్ చేరుకున్న విషయాన్ని టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
హీత్రో విమానాశ్రయం నుంచి ఇరు జట్లు సౌతాంప్టన్ వెళ్లాయి. అక్కడి హోటల్‌లో 10 రోజుల క్వారంటైన్‌లో ఉండబోతున్నాయి. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం.. అక్కడే సాధన ప్రారంభించనున్నాయి. కాగా, కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బందికి మాత్రం 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్ ఉండబోతున్నది. క్వారంటైన్ అనంతరం భారత మహిళా జట్టు జూన్ 16 నుంచి బ్రిస్టల్ వేదికగా ఏకైక టెస్టు ఆడనున్నది. భారత పురుషుల జట్టు సౌతాంప్టన్ హోటల్‌కు సమీపంలోనే ఉన్న రోజ్ బౌల్ వేదికగా జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నది.