ఈ ఏడాదిలోనే టీకా -కేంద్రమంత్రి హర్షవర్ధన్

దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారిని నిలువరించే టీకా ఈ ఏడాది చివరి వరకు సిద్ధమయ్యే అవకాశముందని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మరో నాలుగైదు నెలల్లో కొవిడ్ 19కు వ్యాక్సిన్ సిద్ధమవుతుందని అన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఆఖరుకల్లా భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అనంతరం ట్వీట్ చేశారు. మూడో దశలోకి దేశీయ టీకా : -టాస్క్ ఫోర్స్ దేశీయంగా అభివృద్ధి చేసిన […]

Update: 2020-08-23 04:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారిని నిలువరించే టీకా ఈ ఏడాది చివరి వరకు సిద్ధమయ్యే అవకాశముందని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మరో నాలుగైదు నెలల్లో కొవిడ్ 19కు వ్యాక్సిన్ సిద్ధమవుతుందని అన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఆఖరుకల్లా భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అనంతరం ట్వీట్ చేశారు.

మూడో దశలోకి దేశీయ టీకా : -టాస్క్ ఫోర్స్

దేశీయంగా అభివృద్ధి చేసిన ఒక వ్యాక్సిన్ మూడో దశలోకి ప్రవేశిస్తున్నదని కొవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పౌల్ వెల్లడించారు. తొలి దశల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. ఆయన టీకా పేరు వెల్లడించనప్పటికీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ గురించే ఆయన మాట్లాడారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నారు. టీకా అభివృద్ధి, ఉత్పత్తి చేయనున్న సంస్థలతో టాస్క్ ఫోర్స్ సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News