ఇండియాకు నాలుగు గోల్డ్ మెడల్స్
దిశ, స్పోర్ట్స్: జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ షూటర్స్ గోల్డ్ మెడల్స్ కొల్లగొట్టారు. పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ చివరి రోజైన ఆదివారం భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు గెలిచారు. మొత్తంగా ఈ ఈవెంట్‌లో ఆరు స్వర్ణాలు, రెండు రజత పతకాలతో టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ సమస్య కారణంగా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన మను బాకర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం మూడు స్వర్ణాలతో హ్యాట్రిక్ సాధించింది. భారత […]
దిశ, స్పోర్ట్స్: జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ షూటర్స్ గోల్డ్ మెడల్స్ కొల్లగొట్టారు. పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ చివరి రోజైన ఆదివారం భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు గెలిచారు. మొత్తంగా ఈ ఈవెంట్‌లో ఆరు స్వర్ణాలు, రెండు రజత పతకాలతో టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ సమస్య కారణంగా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన మను బాకర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం మూడు స్వర్ణాలతో హ్యాట్రిక్ సాధించింది. భారత షూటర్లు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్, మహిళల టీమ్, పురుషుల టీమ్ ఈవెంట్లతో పాటు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించారు. సరోబ్‌జిత్ సింగ్‌తో కలసి మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్‌లో, రిథిమ్ సంగ్వాన్-శిఖా నర్వాల్‌తో కలసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లలో మను బాకర్ స్వర్ణ పతకాలు సాధించింది. జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ కూడా స్వర్ణ పతకం గెలిచారు.