నెలాఖరులో ‘బ్రహ్మోస్’ విశ్వరూపం

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ విశ్వరూపం దర్శనమివ్వబోతున్నది. హిందూ మహాసముద్ర రీజియన్‌లో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి సామర్థ్యాన్ని త్రివిధ దళాలు ప్రదర్శించబోతున్నాయి. ఈ నెల చివరి వారంలో ఈ షోకేస్ ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. భిన్న లక్ష్యాలను ఛేదించే పరీక్షలను త్రివిధ దళాలు నిర్వహించనున్నాయి. ఈ పరీక్షలతో క్షిపణి వ్యవస్థను మరింత మెరుగుపరిచే అవకాశం చిక్కవచ్చునని అధికారవర్గాలు అభిప్రాయపడ్డాయి. వేగవంతమైన ఆపరేషనల్ సిస్టమ్ గల ప్రపంచశ్రేణి క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. […]

Update: 2020-11-15 10:41 GMT

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ విశ్వరూపం దర్శనమివ్వబోతున్నది. హిందూ మహాసముద్ర రీజియన్‌లో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి సామర్థ్యాన్ని త్రివిధ దళాలు ప్రదర్శించబోతున్నాయి. ఈ నెల చివరి వారంలో ఈ షోకేస్ ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. భిన్న లక్ష్యాలను ఛేదించే పరీక్షలను త్రివిధ దళాలు నిర్వహించనున్నాయి.

ఈ పరీక్షలతో క్షిపణి వ్యవస్థను మరింత మెరుగుపరిచే అవకాశం చిక్కవచ్చునని అధికారవర్గాలు అభిప్రాయపడ్డాయి. వేగవంతమైన ఆపరేషనల్ సిస్టమ్ గల ప్రపంచశ్రేణి క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. డీఆర్‌‌డీవో ఇటీవలే దీని సామర్థ్యాన్ని 298 కిలోమీటర్ల నుంచి 450కిలోమీటర్లకు పెంచింది. ఇటీవలే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సుఖోయ్-30 ద్వారా బ్రహ్మోస్‌ క్షిపణిని ప్రయోగించగా బంగాళాఖాతంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న పాత ఓడను ధ్వంసం చేసింది. సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

Tags:    

Similar News