కల్వకుంట్ల కవితకు షాక్.. ఇక ఏకగ్రీవం లేనట్టే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు అయ్యింది. నామినేషన్ల చివరి రోజైన మంగళవారం కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ స్థానానికి ప్రధాన ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, బీజేపీలు పోటీ నుంచి తప్పుకోగా, అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు పోటీ నుంచి తప్పుకోగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు అయ్యింది. నామినేషన్ల చివరి రోజైన మంగళవారం కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ స్థానానికి ప్రధాన ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, బీజేపీలు పోటీ నుంచి తప్పుకోగా, అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు పోటీ నుంచి తప్పుకోగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎంపీటీసీల ఫోరం తరపున కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యం అయ్యేలా ఉంది.
ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, నిధులు లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పోటీలో నిలిచినట్లు శ్రీనివాస్ తెలిపారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పోటీచేస్తున్నానన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ బీజేపి పార్టీ కి చెందిన వ్యక్తి. శ్రీనివాస్ సతీమణి మక్లూర్ మండలం అమ్రాధ్ ఎంపీటీసీ గా ఉన్నారు.