బొమ్మ వెంకన్న సేవలు మరువలేనివి.. ఇందుర్తిలో విగ్రహ ఆవిష్కరణ
దిశ, చిగురుమామిడి : చిగురుమామిడి మండలం ఇందూర్తిలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం పలువురు నేతలు ఘనంగా నిర్వహించారు. వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, న్యాయవాదిగా బొమ్మ వెంకన్న అంటే తెలియని వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే లేరని కొనియాడారు. ఆనాటి రాజకీయ పరిస్థితులను […]
దిశ, చిగురుమామిడి : చిగురుమామిడి మండలం ఇందూర్తిలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం పలువురు నేతలు ఘనంగా నిర్వహించారు. వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, న్యాయవాదిగా బొమ్మ వెంకన్న అంటే తెలియని వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే లేరని కొనియాడారు.
ఆనాటి రాజకీయ పరిస్థితులను తట్టుకుని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అన్ని పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.