మందుబాబుల ‘కరోనా’ క్రమశిక్షణ

ప్రపంచం ఓ వైపు మునిగిపోతున్నా వైన్స్‌లు తెరిస్తే చాలు అన్నట్టుగా కొందరు మందుబాబులు తహతహలాడిపోతుంటారు. వైన్స్ ఓపెన్ చేయకముందే ఒకరి వెనుక ఒకరు క్యూలో కిక్కిరిసిపోతారు. లైన్‌లోనే వాదులాడుకుంటారు. దురుసుగా వ్యవహరిస్తారు. ఇది కరోనావిలయం సంభవిస్తున్న కాలమైనా సరే తమకు లెక్కలేదన్నట్టుగా ఉంటున్నారు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు పలురాష్ట్రాలు బార్‌లు, రెస్టారెంట్‌లను మూసేసిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఇంకొకరితో కనీసం మీటరు దూరాన్ని పాటించాలని సూచనలు వచ్చాయి. ఈ సోషల్ డిస్టాన్సింగ్‌ను ఎవ్వరూ పెద్దగా పాటిస్తున్నట్టు […]

Update: 2020-03-20 06:14 GMT

ప్రపంచం ఓ వైపు మునిగిపోతున్నా వైన్స్‌లు తెరిస్తే చాలు అన్నట్టుగా కొందరు మందుబాబులు తహతహలాడిపోతుంటారు. వైన్స్ ఓపెన్ చేయకముందే ఒకరి వెనుక ఒకరు క్యూలో కిక్కిరిసిపోతారు. లైన్‌లోనే వాదులాడుకుంటారు. దురుసుగా వ్యవహరిస్తారు. ఇది కరోనావిలయం సంభవిస్తున్న కాలమైనా సరే తమకు లెక్కలేదన్నట్టుగా ఉంటున్నారు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు పలురాష్ట్రాలు బార్‌లు, రెస్టారెంట్‌లను మూసేసిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఇంకొకరితో కనీసం మీటరు దూరాన్ని పాటించాలని సూచనలు వచ్చాయి. ఈ సోషల్ డిస్టాన్సింగ్‌ను ఎవ్వరూ పెద్దగా పాటిస్తున్నట్టు మనకు కనిపించదు. కానీ, ఈ విషయంలో కేరళలోని మందుబాబుల క్రమశిక్షణపై నెటిజన్లు ముచ్చటపడిపోతున్నారు.

ప్రతి ఒక్కరు ఓపికగా లైన్‌లో నిలబడి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ ‘సరుకు’ కొనుక్కుంటున్న తీరును చూపిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. వైన్స్ ముందు విడిగా నిలుచుకునేందుకు గీసిన లైన్‌లను మందుబాబులు బుద్ధిగా అనుసరిస్తూ మేం ‘బాధ్యతాయుతమైన ట్యాక్స్‌పెయర్స్’ అని వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాపించకుండా తమవంతు బాధ్యతను తప్పకుండా నిర్వహిస్తామని చాటిచెపుతున్నారు.


Tags : social distancing, kerala, alochol consumers, responsible, wines, queue

Tags:    

Similar News