‘దిశ’ కథనంపై నిఘా వర్గాల ఆరా.. పోలీస్ స్టేషన్ అడ్డాగా వసూళ్లు..

దిశ, గోదావరిఖని : వరుస వివాదాల్లో వన్ టౌన్ అనే కథనంపై నిఘా వర్గాలు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని ఓ ఛాయా చిత్రా నిర్వాహకుడు పంచాయితీలు చేస్తూ కొంత మంది వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జరుగుతున్న పరిణామాలపై ‘దిశ’లో వచ్చిన కథనంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సైతం సదరు ఛాయా చిత్ర నిర్వహకుడి మీద ఇలాంటి […]

Update: 2021-10-08 01:12 GMT

దిశ, గోదావరిఖని : వరుస వివాదాల్లో వన్ టౌన్ అనే కథనంపై నిఘా వర్గాలు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని ఓ ఛాయా చిత్రా నిర్వాహకుడు పంచాయితీలు చేస్తూ కొంత మంది వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో జరుగుతున్న పరిణామాలపై ‘దిశ’లో వచ్చిన కథనంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సైతం సదరు ఛాయా చిత్ర నిర్వహకుడి మీద ఇలాంటి ఆరోపణలు తరచూ రావడంతో బదిలీపై వెళ్లిన రామగుండం సీపీ సత్యనారాయణ విచారణ జరిపి సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

Tags:    

Similar News