అనారోగ్య బాధితులకు.. ఆన్ లైన్ వైద్యం
దిశ వెబ్ డెస్క్ ఇప్పుడు ఏ నోటా విన్నా… ఏ చర్చ జరిగినా.. అంతా కరోనా … కరోనానే. ప్రజలంతా ఇళ్ల నుంచి కాలు బయటపెట్టట్లేదు. ఆసుపత్రిలన్నీ ‘కరోనా’ బాధితులతో నిండి పోతున్నాయి. ఔట్ పేషెంట్ విభాగాలు ఎక్కడా పనిచేయడం లేదు. కరోనా కాకుండా.. ఇతరత్రా అనారోగ్యాలతో ఇబ్బంది పడే వారు ఎంతో మంది ఉన్నారు. వారు రెగ్యులర్ చెకప్ లు చేయించుకోవాలి. సొంత వాహనాలు లేవు, రవాణా సౌకర్యం లేదు, డాక్టర్లు అందుబాటులో ఉన్నా… అందరూ […]
దిశ వెబ్ డెస్క్
ఇప్పుడు ఏ నోటా విన్నా… ఏ చర్చ జరిగినా.. అంతా కరోనా … కరోనానే. ప్రజలంతా ఇళ్ల నుంచి కాలు బయటపెట్టట్లేదు. ఆసుపత్రిలన్నీ ‘కరోనా’ బాధితులతో నిండి పోతున్నాయి. ఔట్ పేషెంట్ విభాగాలు ఎక్కడా పనిచేయడం లేదు. కరోనా కాకుండా.. ఇతరత్రా అనారోగ్యాలతో ఇబ్బంది పడే వారు ఎంతో మంది ఉన్నారు. వారు రెగ్యులర్ చెకప్ లు చేయించుకోవాలి. సొంత వాహనాలు లేవు, రవాణా సౌకర్యం లేదు, డాక్టర్లు అందుబాటులో ఉన్నా… అందరూ కరోనా పేషెంట్లను చూడటానికే అంకితమయ్యారు. ఇంటి నుంచి ఆసుపత్రి వరకు ఎలా వెళ్లాలి? ఒక వేళ అంత దూరం వెళ్లినా డాక్టర్లు చూస్తారా? అనారోగ్య భాదితుల మదిలో ఎన్నో ప్రశ్నలు ? ఆ ప్రశ్నలన్నింటికీ చెక్ చెబుతూ… కార్పోరేట్ ఆసుపత్రులు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. సెల్ ఫోన్ తో డాక్టర్లను సంప్రదించవచ్చు. వీడియో కాల్ లో సలహాలు స్వీకరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకు ముందస్తు అపాయింట్ మెంట్ తీసుకోవాలి.
రాష్ర్టంలో .. కరోనా కల్లోల పరిస్థితులను సృష్టించింది. మన రాష్ర్టంలో ఎంతోమంది డయాబెటిస్ తో బాధపడే వాళ్లున్నారు. రెగ్యులర్ గా డయాలిసిస్ చేయించుకునే వాళ్లున్నారు. ఇవే కాకుండా.. బీపీ, గుండె, కాలేయ, మూత్రపిండాల సమస్యలతో సతమతమయ్యేవాళ్లున్నారు. రాష్ర్టమంతా కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రజల ఎటూ వెళ్లలేని పరిస్థితి. డాక్టర్లు అందుబాటులో ఉన్నా… ఓపీ సేవలను కొనసాగించలేని పరిస్థితి. కరోనా విజృంభించడంతో డాక్టర్లు తమ శక్తి వంచన లేకుండా కరోనా బాధితులను చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే .. కార్పోరేట్ ఆసుపత్రులు ఆన్ లైన్ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాయి. అవసరమైతే రోగిని వీడియోకాల్ ద్వారా వైద్యుడు చూసి.. నిర్దారణ పరీక్షల ఫలితాలను డిజిటల్ విధానంలోనే పరీక్షించి, సలహాలు సూచిస్తాడు. వాటికి అవసరమయ్యే మెడిసిన్ రాసిస్తాడు. అందుకోసం పేషెంట్లు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
సన్ షైన్ ఆసుపత్రి :
అనారోగ్య బాధితుల సందేహాల కోసం .. ‘‘ఎంఫిన్’’ అనే హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. డాక్టర్ ను సంప్రదించాలి అనుకునేవాల్లు.. ముందుగా 040-44550000 నంబర్ కు ఫోన్ చేసి .. రోగి సెల్ ఫోన్ నెంబరు, పేరు, ప్రాంతం .. తదితర వివరాలు ఇవ్వాలి. ఎంఫిన్ నుంచి.. ఔట్ పేషెంట్ కు ఓ లింకు వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే చాలు.. వైద్యుడితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ సేవలను వాళ్లు ఉచితంగా అందించడం విశేషం.
అపోలో ఆసుపత్రి :
అపోలో యాజమాన్యం కూడా .. రోగుల కోసం ప్రత్యేక యాప్ / వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదే https://www.apollo247.com/
దీన్నుంచి మనం వైద్యుల ముందస్తు అపాయింట్ మెంట్ తీసుకోవచ్చు. 24 గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారికి వైద్య పరీక్షలు రాస్తారు.
https://www.apollo247.com/
యశోద ఆసుపత్రి :
యశోద వైద్యుల అపాయింట్ మెంట్ కావాలన్నా… వారి సేవలు పొందాలన్నా… https://www.yashodahospitals.com/ ఈ లింక్ ద్వారా పొందొచ్చు. నెట్ సేవలు అందుబాటులో లేని వాళ్లు.. 040-45674567 నెంబర్ ను సంప్రదించవచ్చు.
ఎమర్జెన్సీ కేసుల విషయంలో .. టెస్ట్ ల ఆధారంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటే.. వెంటనే అడ్మిట్ కావాల్సిందిగా సూచిస్తారు. యశోద వైద్యులు ఈ వెబ్ సైట్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు.
కిమ్స్ ఆసుపత్రి :
వైద్యులను సంప్రదించాలంటే… ముందుగా .. అపాయింట్మెంట్ తీసుకోవాలి. అందుకు 040-44885000 నంబర్ కు కాల్ చేయాలి. వెంటనే మన సెల్ ఫోన్ కు ఓ లింక్ వస్తుంది.
ఆ లింక్ పై క్లిక్ చేస్తే కిమ్స్ అఫిషియల్ వెబ్సైట్ కు లాగిన్ అవుతాం. అక్కడ మనకు అవసరమైన వైద్యుని అపాయింట్ తీసుకుని.. సంప్రదించాలి.
ఇవే కాకుండా :
ప్రాక్టో. కామ్, 1ఎమ్ జీ. కామ్, ఐక్లినిక్, డాక్టర్ ఇన్ స్టా . కామ్ , డాక్స్ యాప్. కామ్, లిబ్రేట్ కామ్, మొదలైనవి మనకు ఎప్పటి నుంచో వైద్య సేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నాయి. వీటిని కూడా సంప్రదించవచ్చు.
ఎమర్జెన్సీ కాకపోతే :
కరోనా కాకుండా ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు.. రెగ్యులర్ చెకప్ చేయించుకునేవాళ్లు.. ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఎమర్జెన్సీ కాకపోతే.. మన కాలనీలో.. లేదా మనకు దగ్గర్లో ఉన్న వైద్యులను కూడా సంప్రదించవచ్చు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. వైద్యుల అందుబాటులో లేని వాళ్లు మాత్రం ఆన్ లైన్ ఆయా కార్పోరేట్ ఆసుపత్రుల వైద్యులను సంప్రదించవచ్చు.
Tags: corona, heart, kidney, bp, sugar, diabetis, corporate, hospitals, check up, online, mobile, phone number