"జీవితం, మనుషులు, ప్రేమ".. ఇదే మా కథ

దిశ, సినిమా: సుమంత్ అశ్విన్, సీనియర్ యాక్టర్ శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో డ్రీమ్ డెస్టినేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తో కామన్ ఎమోషన్ తప్ప పరిచయం లేని నలుగురు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ కలిసి సాగించిన ప్రయాణమే స్టోరీ. ఈ నలుగురి జర్నీ ‘జీవితం, మనుషులు, ప్రేమ’ను సరికొత్తగా ఆవిష్కరించగా.. తమ రైడ్‌ను వ్యతిరేకించిన వారిని కూడా ఇన్‌స్పైర్ చేస్తుందని, తమ భావనలను మార్చుకునేలా […]

Update: 2021-09-26 04:25 GMT

దిశ, సినిమా: సుమంత్ అశ్విన్, సీనియర్ యాక్టర్ శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో డ్రీమ్ డెస్టినేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తో కామన్ ఎమోషన్ తప్ప పరిచయం లేని నలుగురు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ కలిసి సాగించిన ప్రయాణమే స్టోరీ. ఈ నలుగురి జర్నీ ‘జీవితం, మనుషులు, ప్రేమ’ను సరికొత్తగా ఆవిష్కరించగా.. తమ రైడ్‌ను వ్యతిరేకించిన వారిని కూడా ఇన్‌స్పైర్ చేస్తుందని, తమ భావనలను మార్చుకునేలా చేస్తుందని తెలుస్తోంది. కాగా, మహేశ్ గొల్ల నిర్మించిన సినిమాకు గురు పవన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో మొదటి జర్నీ ఫిలిం ఇదే కాగా, అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చిన చిత్రానికి సీ రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

Tags:    

Similar News