షాకింగ్.. ‘వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ డకౌట్‌కు భారీ ప్లాన్’

దిశ, స్పోర్ట్స్: ఇండియా – పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్ ముగిసి నెల రోజుల పైగానే గడిచింది. వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు తొలి సారిగా పాకిస్తాన్‌పై ఓడిపోయింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులు విసిరి భారత టాపార్డర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీని పెవిలియన్ పంపాడు. భారత జట్టు ఆ తర్వాత కోలుకోలేదు. ఈ మ్యాచ్‌ను టీమ్ ఇండియా 10 వికెట్లతో […]

Update: 2021-12-04 10:24 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియా – పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్ ముగిసి నెల రోజుల పైగానే గడిచింది. వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు తొలి సారిగా పాకిస్తాన్‌పై ఓడిపోయింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులు విసిరి భారత టాపార్డర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీని పెవిలియన్ పంపాడు. భారత జట్టు ఆ తర్వాత కోలుకోలేదు. ఈ మ్యాచ్‌ను టీమ్ ఇండియా 10 వికెట్లతో ఓడిపోయింది. అయితే ఆ రోజు రోహిత్ శర్మ తాను ఎదుర్కున్న తొలి బంతికే డక్ అవుట్ అయ్యాడు. రోహిత్‌ను అవుట్ చేయడానికి చాలా రోజుల ముందే పాకిస్తాన్ వ్యూహం పన్నినట్లు తెలుస్తున్నది.

ఆ విషయాన్ని ప్రస్తుతం పీసీబీ చైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజా వెల్లడించారు. ‘రోహిత్‌ను అవుట్ చేయడానికి మ్యాచ్‌కు చాలా రోజుల ముందే వ్యూహం సిద్ధం చేశారు. అందులో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. నువ్వు రోహిత్‌ను ఎలా అవుట్ చేయాలనుకుంటున్నావు అని బాబర్‌ను అడిగాను. అతను క్రిక్ విజ్‌ను ఉపయోగిస్తా అని అన్నాడు. టీమ్ ఇండియా కూడా క్రిక్ విజ్ చూసే బరిలోకి దిగుతుంది. కాబట్టి నేనొకటి చెప్తాను విను.. రోహిత్ శర్మకు అత్యధిక వేగంతో ఇన్-స్వింగర్ వేయించు అని సలహా ఇచ్చాను. షాహిన్ అఫ్రిదితో సేమ్ అలాగే బాబర్ చెప్పాడు. దీంతో తొలి బంతికే వికెట్ తీయగలిగాము.’ అని రమీజ్ రాజా చెప్పాడు. రోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో షాహిన్ బంతిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.

10/10 క్లబ్‌లోకి అజాజ్ పటేల్.. అనిల్ కుంబ్లే ఏమన్నాడంటే.?

Tags:    

Similar News