దీపావళికి అమ్మకాలు మరింత పెరుగుతాయి: హ్యూండాయ్ మోటార్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ అమ్మకాల్లో 13.2 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. స్పోర్ట్ యుటిలిటీ విభాగంలోని హ్యూండాయ్ వెన్యూ, క్రెటా మోడళ్లు కంపెనీ అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి. సెప్టెంబర్‌లో మొత్తం 50,313 యూనిట్లను విక్రయించగా, ఆగష్టులో 45,809 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక, గతేడాది అక్టోబర్‌లో హ్యూండాయ్ మొత్తం 50,010 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ అమ్మకాల్లో 13.2 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. స్పోర్ట్ యుటిలిటీ విభాగంలోని హ్యూండాయ్ వెన్యూ, క్రెటా మోడళ్లు కంపెనీ అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి. సెప్టెంబర్‌లో మొత్తం 50,313 యూనిట్లను విక్రయించగా, ఆగష్టులో 45,809 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక, గతేడాది అక్టోబర్‌లో హ్యూండాయ్ మొత్తం 50,010 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. నవంబర్‌లో దీపావళి సమీపిస్తున్న వేళ దేశీయంగా అధిక అమ్మకాలను లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ నెల అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని, ఈ వృద్ధి ఇలాగే కొనసాగుతుందనే నమ్మకముందని హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్, సర్వీసెస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు.