బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించకపోవడంతో  బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ. 780 కోట్లు రుణాలను పార్థసారథి తీసుకున్నారు. అలాగే రూ. 720 కోట్లు కస్టమర్ల నిధులను తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకుని […]

Update: 2021-08-19 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ. 780 కోట్లు రుణాలను పార్థసారథి తీసుకున్నారు. అలాగే రూ. 720 కోట్లు కస్టమర్ల నిధులను తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశిస్తున్నారు. గత కొంత కాలం నుంచి కార్వీ కన్సల్టెన్సీపై సెబీ ఆంక్షలు విధించింది.

Tags:    

Similar News