హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక సమావేశం
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ సైతం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నుంచి కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. కానీ హుజురాబాద్‌లో ఎలాంటి ప్రణాళిక అమలు చేయాలనే అంశాలపై పార్టీ చర్చిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లు, కరీంనగర్ జిల్లా పార్టీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 19 నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ సైతం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నుంచి కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. కానీ హుజురాబాద్‌లో ఎలాంటి ప్రణాళిక అమలు చేయాలనే అంశాలపై పార్టీ చర్చిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లు, కరీంనగర్ జిల్లా పార్టీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 19 నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కార్యకర్తలు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు తీసుకుని ఎంపిక చేస్తామన్నారు. ఇక కాంగ్రెస్‌లో కోవర్టు రాజకీయాలు నడవవని, కోవర్టు రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి టీఆర్ఎస్, కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉందని, హుజురాబాద్‌లో పార్టీ జెండా ఎగురుతుందని రాజనర్సింహా వెల్లడించారు.