డబ్బులివ్వలేదని ఆ ఇద్దరు నేతలను ఇంట్లో బంధించిన గ్రామస్తులు (వీడియో)

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఏ ఎన్నికల్లో జరగని వినూత్న సంఘటనలు హుజురాబాద్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఏకంగా రోడ్డుమీదకు వచ్చిన ధర్నాలు చేసిన సందర్భాలు మనంచూశాం. తాజాగా.. జమ్మికుంట మండలంలోని కొరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచినప్పటికీ, ఆ డబ్బులు తమకు రాలేదని స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్ ఇంటికి తాళం వేసి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన […]

Update: 2021-10-30 03:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఏ ఎన్నికల్లో జరగని వినూత్న సంఘటనలు హుజురాబాద్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఏకంగా రోడ్డుమీదకు వచ్చిన ధర్నాలు చేసిన సందర్భాలు మనంచూశాం. తాజాగా.. జమ్మికుంట మండలంలోని కొరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచినప్పటికీ, ఆ డబ్బులు తమకు రాలేదని స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్ ఇంటికి తాళం వేసి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకొని వారిని విడిపించారు.

Tags:    

Similar News