ప్రేమ పెళ్ళి.. వరకట్నం కోసం భర్త అరాచకం

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. సూర్యాపేటకు చెందిన శ్రీ నిధి(రుబీనా), మంచిర్యాలకు చెందిన కొండ వంశీ కృష్ణ ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే, వంశీకృష్ణ వరకట్నం కోసం కట్టుకున్న భార్యను వేధిస్తూ ఆమె ఇంటి వద్ద వదలివచ్చాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆమె భర్త ఇంటి ఎదుట శుక్రవారం మౌన పోరాటానికి దిగింది. రాత్రి సమయం కావడంతో పోలీసులు […]

Update: 2021-09-24 11:54 GMT

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. సూర్యాపేటకు చెందిన శ్రీ నిధి(రుబీనా), మంచిర్యాలకు చెందిన కొండ వంశీ కృష్ణ ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే, వంశీకృష్ణ వరకట్నం కోసం కట్టుకున్న భార్యను వేధిస్తూ ఆమె ఇంటి వద్ద వదలివచ్చాడు.

దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆమె భర్త ఇంటి ఎదుట శుక్రవారం మౌన పోరాటానికి దిగింది. రాత్రి సమయం కావడంతో పోలీసులు ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News