విషాదం.. రోడ్డు ప్రమాదంలో భార్యాబిడ్డను కోల్పోయిన భర్త
దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రమ్య, అనిల్ కుమార్ దంపతులు.. తమ కుమారుడిని లక్ష్మీ నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. అనంతరం తిరిగి ఇంటికి స్కూటీ మీద వెళుతుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే […]
దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రమ్య, అనిల్ కుమార్ దంపతులు.. తమ కుమారుడిని లక్ష్మీ నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. అనంతరం తిరిగి ఇంటికి స్కూటీ మీద వెళుతుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్ కుమార్ స్వల్పంగా గాయపడ్డారు. కాగా, అనిల్ కాళేశ్వరం ప్రాజెక్టులో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు.