4 దేవాలయాల్లో హుండీలు ధ్వంసం.. నగదు చోరీ

దిశ, అర్వపల్లి : దేవాలయాల్లో హుండీలు పగులగొట్టి, నగదు దోచుకెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని శివాలయం, గంగ దేవమ్మ దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, కంఠమహేశ్వర స్వామి దేవాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు హుండీలను పగులగొట్టి వాటిలో ఉన్న నగదును దోచుకెళ్లారు. సోమవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో శివాలయం పూజారి కోడూరి వినయ్ శర్మ దేవాలయంలో పూజలు ముగించుకుని, […]

Update: 2021-10-19 03:36 GMT

దిశ, అర్వపల్లి : దేవాలయాల్లో హుండీలు పగులగొట్టి, నగదు దోచుకెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని శివాలయం, గంగ దేవమ్మ దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, కంఠమహేశ్వర స్వామి దేవాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు హుండీలను పగులగొట్టి వాటిలో ఉన్న నగదును దోచుకెళ్లారు.

సోమవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో శివాలయం పూజారి కోడూరి వినయ్ శర్మ దేవాలయంలో పూజలు ముగించుకుని, గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చి చూసేసరికి హుండీ పగులగొట్టి ఉండడంతో సర్పంచ్, గ్రామస్తులకు సమాచారం అందించగా గ్రామంలోని నాలుగు దేవాలయాల్లో హుండీలు ధ్వంసం చేసి చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు, అపరిచితులు సంచరించినట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ట్రైనీ ఎస్సై ఆలీమా బేగం కోరారు.

Tags:    

Similar News