అక్కడ పోలీస్ యంత్రాంగం సైలెంట్.. శాంతిభద్రతల పరిరక్షణలో తన్నులు తింటున్న పోలీసులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో రానురాను శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలను కాపాడే పోలీసులు కూడా ఆపదలో ఉన్నట్టు తెలుస్తోంది.ఆదివారం రాత్రి నగరంలోని బోధన్ రోడ్డులో ఓ హోటల్ అర్ధరాత్రి తెరిచి ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు హోటల్ ఫోటో తీస్తున్న నిఘా కానిస్టేబుల్ పై హోటల్ నిర్వహకులు దాడి చేశారు. రాత్రి టైంలో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పాన్‌షాపులు తెరిచి ఉంచడం వలన […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో రానురాను శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలను కాపాడే పోలీసులు కూడా ఆపదలో ఉన్నట్టు తెలుస్తోంది.ఆదివారం రాత్రి నగరంలోని బోధన్ రోడ్డులో ఓ హోటల్ అర్ధరాత్రి తెరిచి ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు హోటల్ ఫోటో తీస్తున్న నిఘా కానిస్టేబుల్ పై హోటల్ నిర్వహకులు దాడి చేశారు.
రాత్రి టైంలో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పాన్‌షాపులు తెరిచి ఉంచడం వలన శాంతి భద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు కొంతకాలంగా మూసివేయిస్తున్నారు. ఆదేశాలను పాటించకుండా షాపులు మూసివేయించడంలో విఫలమైన పలువురు పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ కార్తికేయ మెమోలు ఇచ్చారు. కానీ హోటల్ నిర్వహకులు అందుకు అంగీకరించకపోవడంతో అధికారులు నిఘాను ఏర్పాటుచేశారు.
అందులో భాగంగా ఆదివారం రాత్రి బోధన్ రోడ్డులోని సవేరా హోటల్ తెరిచి ఉండటంతో దానిని ఫొటోలు తీస్తున్న ఎస్‌బీ సిబ్బంది ఫోన్ లాక్కుని నిర్వహకులు దాడి చేశారు. గత నెల గణేష్ నిమజ్జనం రోజు సైతం స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఆ ఘటన మరువక ముందే మరో హెడ్ కానిస్టేబుల్ పై దాడి జరగడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఏకంగా పోలీసులపైనే దాడి జరిగినా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు చేతులు రావడం లేనట్టు తెలుస్తోంది.