సీఎం కేసీఆర్ అవినీతిపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బియ్యం కుంభకోణంతోపాటు ఇతర అవినీతిని వెలికితీయాలని పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో టీఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. అంతేకాకుండా కేసీఆర్ అవినీతి బాగోతాన్ని ప్రజలకు […]

Update: 2021-12-21 05:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బియ్యం కుంభకోణంతోపాటు ఇతర అవినీతిని వెలికితీయాలని పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో టీఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. అంతేకాకుండా కేసీఆర్ అవినీతి బాగోతాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరపాలని ప్రజల నుంచి డిమాండ్ తీసుకురావాలని తెలిపారు. పార్టీలకు ప్రభుత్వాల వ్యవహారాలకు సంబంధం లేదని ఆయన వివరించారు. ఈ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారంపై కేంద్రం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్లాష్.. ఫ్లాష్.. ఆ ఉద్యోగులకు KCR సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్……భారీగా జీతాలు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు

సీఎం జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. రాజకీయ వర్గాల్లో చర్చ

Tags:    

Similar News