ప్రైవేటు స్కూళ్ల జీవో ఉల్లంఘనపై విచారణ
దిశ, వెబ్డెస్క్: ప్రైవేటు స్కూళ్ల జీవో ఉల్లంఘనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 11 స్కూళ్లపై సమగ్ర విచారణ జరిపిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. 10 పాఠశాలలు ఉల్లంఘనకు పాల్పడినట్లు విద్యాశాఖ రిపోర్టులో పేర్కొంది. మరో స్కూల్ పై విచారణ జరిపేందుకు కొంత సమయం కావాలని కమిటీ తెలిపింది. ఈ మేరకు సీబీఎస్ఈ స్కూల్స్ అడ్వొకేట్ వాయిదా కోరింది. కాగా, ఈ నెల 9న సింగిల్ బెంచ్ ముందు విచారణ జరిగే స్కూల్ పై […]
దిశ, వెబ్డెస్క్:
ప్రైవేటు స్కూళ్ల జీవో ఉల్లంఘనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 11 స్కూళ్లపై సమగ్ర విచారణ జరిపిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. 10 పాఠశాలలు ఉల్లంఘనకు పాల్పడినట్లు విద్యాశాఖ రిపోర్టులో పేర్కొంది. మరో స్కూల్ పై విచారణ జరిపేందుకు కొంత సమయం కావాలని కమిటీ తెలిపింది. ఈ మేరకు సీబీఎస్ఈ స్కూల్స్ అడ్వొకేట్ వాయిదా కోరింది. కాగా, ఈ నెల 9న సింగిల్ బెంచ్ ముందు విచారణ జరిగే స్కూల్ పై వాదించేందుకు పిటిషనర్ తరపు లాయర్ ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది.