'రాజ రాజ చోర' టీజర్: పగలంతా సాఫ్ట్ వేర్  వేషాలు.. రాత్రైతే చోర విన్యాసాలు

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోలో శ్రీ విష్ణు ఒకడు. విభిన్నమైన కథలను ఎంచుకొంటూ విజయాలను అందుకుంటున్న ఈ హీరో ‘గాలి సంపత్’ చిత్రం  తర్వాత మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం  ”రాజ రాజ చోర”. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్స్, టీజర్ అనౌన్స్ మెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ […]

Update: 2021-06-18 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోలో శ్రీ విష్ణు ఒకడు. విభిన్నమైన కథలను ఎంచుకొంటూ విజయాలను అందుకుంటున్న ఈ హీరో ‘గాలి సంపత్’ చిత్రం తర్వాత మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం ”రాజ రాజ చోర”. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్స్, టీజర్ అనౌన్స్ మెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. నిత్యానంద చెప్పే ప్రవచనంతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.

చోర కళలో సిద్ధహస్తుడైన హీరో తనను తాను సాఫ్ట్ వేర్ అని చెప్పుకొంటూ రాత్రిళ్ళు దొంగతనాలు చేసే దొంగగా కనిపించాడు. పగలంతా సాఫ్ట్ వేర్ వేషాలు.. రాత్రి కాగానే దొంగ పనులు.. మధ్యలో హీరోయిన్ మేఘా ఆకాష్ తో రొమాన్స్ తో సాగిపోతున్న హీరో లైఫ్ లోకి రావణుడు రవిబాబు ఎంట్రీ అయినట్లు చూపించారు. ఇక వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు.. చివర్లో ఇప్పటి వరకు ప్రచార చిత్రాల్లో చూపిస్తూ వస్తున్న రాజు కిరీటాన్ని మన చోరుడు దొంగిలించి పారిపోతున్నట్లు చూపించారు. టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకొంది. ఇక టీజర్ కి వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News