తమిళనాడును వణికిస్తున్న వర్షాలు

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై, కాంచీపురం, తంజావూర్, పదుకొట్టై, నాగపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలుతోడూ, ఈదురు గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలెవరూ బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సహాయక […]

Update: 2020-11-07 21:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై, కాంచీపురం, తంజావూర్, పదుకొట్టై, నాగపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలుతోడూ, ఈదురు గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలెవరూ బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

Tags:    

Similar News