గాలివాన బీభత్సం.. రైతన్నకు తీవ్ర నష్టం

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని ఐదారు మండలాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా పడింది. మంగళవారం సాయంత్రం గంటకుపైగా వీచిన ఈదురు గాలులు.. ఆపై భారీ వర్షం పడింది. జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే జిల్లాలోని నిర్మల్ లక్ష్మణ్ చంద, మామడ, సోన్ తదితర మండలాల్లో ఐకేపీ, మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన మక్కలు, ధాన్యం నీటి పాలయ్యింది […]

Update: 2020-04-28 19:29 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని ఐదారు మండలాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా పడింది. మంగళవారం సాయంత్రం గంటకుపైగా వీచిన ఈదురు గాలులు.. ఆపై భారీ వర్షం పడింది. జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే జిల్లాలోని నిర్మల్ లక్ష్మణ్ చంద, మామడ, సోన్ తదితర మండలాల్లో ఐకేపీ, మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన మక్కలు, ధాన్యం నీటి పాలయ్యింది అలాగే మామిడి పంట కూడా పెద్ద మొత్తంలో రాలిపోయింది. కాగా నష్టం అంచనాలను తయారు చేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలను జిల్లా అధికారులకు ఆదేశించారు.

Tags: Heavy rain, Severe, damage, crops, nirmal, adilabad, buying center

Tags:    

Similar News