వరద నీటి ప్రవాహానికి ఊడిన పులిచింతల డ్యామ్ గేట్

దిశ,హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులలో‌ ఉన్న చింతలపాలెం సమీపంలోని పులిచింతల ప్రాజెక్ట్ వద్ద గురువారం తెల్లవారుజామున 3.45 గంటలకు వరద నీటిని కిందకు విడుదల చేశారు. ఈ క్రమంలో 16 వ నెంబర్ గేటు ఊడిపోయింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1 లక్ష క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తుండగా గేటు ఊడినట్లు తెలుస్తోంది. దీంతో మరో 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా దిగువకు చేరుతున్నట్లు సమాచారం. […]

Update: 2021-08-04 21:29 GMT

దిశ,హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులలో‌ ఉన్న చింతలపాలెం సమీపంలోని పులిచింతల ప్రాజెక్ట్ వద్ద గురువారం తెల్లవారుజామున 3.45 గంటలకు వరద నీటిని కిందకు విడుదల చేశారు. ఈ క్రమంలో 16 వ నెంబర్ గేటు ఊడిపోయింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1 లక్ష క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తుండగా గేటు ఊడినట్లు తెలుస్తోంది. దీంతో మరో 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా దిగువకు చేరుతున్నట్లు సమాచారం. ప్రత్యయామ్నాయం గా అధికారులు ఎమర్జెన్సీ గేటును బిగిస్తున్నారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News