ఆ ఎస్సైకి హ్యాట్సాఫ్

ఎస్సై సార్ మీకు హ్యాట్సాఫ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న మాట. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు. జనాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రోడ్లపైకి రావొద్దంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులు వారి కుటుంబాలు పడుతున్న వేదనకు అద్దంపట్టేలా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఎస్సై తన విధుల్ని ముగించుకుని ఇంటికి వెళ్లారు. పిల్లల్ని భార్యను ఇంటిలోనే ఉంచారు. బయటే […]

Update: 2020-03-30 00:55 GMT

ఎస్సై సార్ మీకు హ్యాట్సాఫ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న మాట. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు. జనాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రోడ్లపైకి రావొద్దంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులు వారి కుటుంబాలు పడుతున్న వేదనకు అద్దంపట్టేలా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఎస్సై తన విధుల్ని ముగించుకుని ఇంటికి వెళ్లారు. పిల్లల్ని భార్యను ఇంటిలోనే ఉంచారు. బయటే ఉండి భోజనం చేశారు. తండ్రి ఇంటికి రావటంతో ఇద్దరు పిల్లలు గేటు దగ్గరే నిలబడి అమాయకంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఫొటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫొటో ఏపీకి చెందినదిగా, ఆ అధికారికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. లాక్ డౌన్ సూచనలు పాటించని వారికి ఈ పోలీసు అధికారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

Tags: hats off si, social media, follow lack rules

Tags:    

Similar News